గోప్యతా విధానం
మీరు లేఖినిలో టైపు చేసే సమాచారం విషయంలో మీ అంతరంగికతను, దానికి వాటిల్లే నష్టభయాలను అర్థం చేసుకోడానికి లేఖిని అనుసరించే ఈ గోప్యతా విధానం మీకు ఉపయోగపడవచ్చు.
మీ గుర్తింపు
లేఖినిలో ఎటువంటి వాడుకరి నమోదు పద్ధతి లేదు. లేఖినిని వాడుకోడానికి మీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు అన్నది (అంటే మీ పేరు, ఈమెయిలు చిరునామా, ఫోను నెంబరు, వంటి వ్యక్తిగత వివరాలు) లేఖినికి తెలియదు.
మీరు వెబ్‌సైటును సందర్శించినప్పుడు, అన్ని వెబ్‌సైట్ల వలెనె, లేఖినికి మీ పరికరపు ఐ.పీ. చిరునామా, మీ విహారిణి ఏమిటి అనే వివరాలు తెలుస్తాయి. ఈ వివరాలు సర్వరు చిట్టాలలో ఓ నెల రోజులపాటు ఉంటాయి. ఆ సమాచారాన్ని లేఖిని ఉపయోగించదు. లేఖినికి జాల ఆతిథ్య సేవలు అందిస్తున్న కంపెనీకి మీ ఐ.పీ. చిరునామా, విహారిణి వివరాలు తెలుస్తాయి.
పలు పరికరాలలో లేఖిని సరిగా పనిచేసేలా చూడడానికి, లేఖిని వాడుకరులు ఎటువంటి విహారుణులను వాడుతున్నారు అనే విషయాన్ని లేఖిని స్థూలస్థాయిలో గమనిస్తూంటుంది. ఈ స్థూలస్థాయి సమాచారంలో వాడుకరుల ప్రాంతాన్ని తెలిపే ఐ.పీ. చిరునామా వివరాలు ఉండవు.
మీ సమాచారం
లేఖినిలో మీరు టైపు చేసే విషయం కేవలం మీ పరికరం లోని విహారిణిలో లేఖిని వెబ్‌సైటుకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమాచారాన్ని లేఖిని మీ విహారిణి స్థానిక నిల్వకై ఉద్దేశించిన జాగా లోనే భద్రపరుస్తుంది. మీరు టైపు చేసే విషయాన్ని లేఖిని తన సర్వరుకు కూడా పంపించదు.
మీ సమాచారాన్ని లేఖిని మరే ఇతర వ్యక్తులతోనూ, సంస్థలతోనూ పంచుకోదు.
ప్రకటనలు, జాల విశ్లేషక సేవలు
వ్యాపార ప్రకటనల నిమిత్తమూ, జాల గణాంకాల విశ్లేషణ కోసమూ లేఖిని ఎంటువంటి సేవలనూ ఉపయోగించడం లేదు. కనుక లేఖినిలో మీరు టైపు చేసే సమాచారం, మీ జాడ మూడవ-పక్ష సేవలకు పొక్కదు.
మార్పు చేర్పులు
ఈ గోప్యతా విధానానికి మార్పులను వాటి అమలుకు ముందుగానే ఈ పేజీలోనే ప్రచురిస్తాము.
2022 మార్చి 15